సినిమాను నిలిపివేయాలంటు హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి
దిశా సినిమాను నిలిపివేయాలి అంటూ హైకోర్టును దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఆశ్రయించారు. గతేడాది జరిగిన దిశా ఘటన ఆధారంగా దిశ పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు..;
దిశా సినిమాను నిలిపివేయాలి అంటూ హైకోర్టును దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ఆశ్రయించారు. గతేడాది జరిగిన దిశా ఘటన ఆధారంగా దిశ పేరుతో రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకొని సినిమా తీయద్దని ఆవేదన వ్యక్తం చేస్తూ హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్ దాఖలు చేసారు. ఈ సినిమా పై కేంద్ర ప్రభుత్వం స్పందించి సెన్సార్ బోర్డ్ పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయగా ఈ పిటిషన్ పై అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ స్పందించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తన్నారు దిశా తండ్రి. తన కూతురికి జరిగిన దారుణం ఆధారంగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న సినిమాను అడ్డుకోవాలని కోరుతూ దిశ తండ్రి పిటిషన్ వేశారు. తమను సంప్రదించకుండానే రామ్ గోపాల్ వర్మ దిశ పేరుతో సినిమా ఎలా రూపొందిస్తారని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని ఆర్జీవీ దిశ పేరుతో సినిమా తీస్తున్నారు మండిపడ్డారు. సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియాలో పెట్టి తమ పరువును బజారుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.