Minister Ponguleti : దేశానికి రోల్ మోడల్ గా డిజాసర్ మేనేజ్మెంట్

Update: 2025-07-03 12:15 GMT

రాష్ట్రంలో తెలంగాణ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండేలా రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశిం చారు. ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని వీలైనంత వరకు ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరగకుండా ఉండేలా ఆధారిటీని బలోపేతం చేస్తున్నామన్నారు. బుధవారం సెక్రటేరియట్ లో గోదావరి మరియు కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ కె. రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారా న్ని ఐఎండీతో సమన్వయం చేసుకొని శాస్త్రీయంగా విశ్లేషించుకొని ఎప్పటికప్పుడు పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు అందించేలా వ్యవస్థను రూపొందించుకోవాలన్నారు. ‘సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావాలి. ప్రధానంగా కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాల అధికార యంత్రాంగం వరద ముంపును ముందుగానే గుర్తించి ఎప్పటిక ప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నదీ పరివాహక ప్రాంతాల్లోని నిర్వాసితుల వివరాలను గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తాం.' అని పొంగులేటి అన్నారు.

Tags:    

Similar News