Kamareddy: ట్రీట్‌మెంట్ చేస్తుండగా వైద్యుడు, పేషెంట్ ఒకేసారి మృతి..
Kamareddy: కామారెడ్డి జిల్లా గాంధారిలో విషాదం చోటుచేసుకుంది.;
Kamareddy: కామారెడ్డి జిల్లా గాంధారిలో విషాదం చోటుచేసుకుంది. ట్రీట్‌మెంట్ చేస్తూ వైద్యుడు, చికిత్స పొందుతూ రోగి మృతి చెందిన విషాద ఘటన గాంధారిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో జరిగింది. గుజ్జల్ తండాకు చెందిన జగ్యనాయక్‌కు గుండెపోటు రావడంతో అతని కుటుంబ సభ్యులు గాంధారిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్ ప్రారంభించిన డాక్టర్ లక్ష్మణ్‌కు అదే సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఇటు డాక్టర్, అటు పేషెంట్... ఇద్దరూ మృతి చెందారు.