Hyderabad : భూకంపం భయం వద్దు.. హైదరాబాద్ సేఫ్..

Update: 2024-12-05 11:45 GMT

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూమి కంపించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఎవరిని కదిపినా భూకంపం గురించే చర్చించుకున్నారు. అయితే.. హైదరాబాద్ ఉన్న లొకేషను బట్టి ఈ ప్రాంతంలో అసలు భూకంపం వచ్చే పరిస్థితి ఉండదని కొందరు అంటున్నారు. కాగా.. మరి బుధవారం భూకంపం కొద్దిసేపు ఎందుకు వచ్చిందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మన దగ్గర చాలా అరుదుగా మాత్రమే సంభవించే భూకంపం వెనుక కారణాలేమిటి? అనే అన్వేషణలో పడ్డారు జియోలజిస్టులు.

మనం రక్షణ వలయంలోనే ఉన్నామా? భూకంపాల ఫ్రీక్వెన్సీని బట్టి దేశంలో జోన్ 2 నుంచి 5 వరకు నాలుగు సెస్మిక్ జోన్లుగా విభజించారు. చాలా తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాలను జోన్-2గా పేర్కొంటారు. ప్రమాదకరమైన ప్రాంతాలను జోన్-5 కింద చేర్చారు. తెలంగాణ మొత్తం జోన్- 2 కిందకు వస్తుంది. అంటే మన దగ్గర భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. పైగా ప్రభావం కూడా చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ సముద్ర మట్టానికి దాదాపు 542 మీటర్ల ఎత్తులో ఉంది. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉండటంతో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందని తెలిపారు. మనకు ఇబ్బంది లేదని టెన్షన్ పడొద్దని సూచించారు.

Tags:    

Similar News