సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ డా. అనురాధ అన్నారు. బతుకమ్మ దసరా పండుగ ఆఫర్ల పేరిట సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి డబ్బులు పంపించి మోస పోవద్దు అన్నారు. గూగుల్ ఫే ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల్లో మీరు డబ్బులు పోగొట్టు కొన్నా వెంటనే లేదా, 24 గంటల లోపు జాతీయ హెల్ప్ లైన్ నం. 1930, 112, 100 ల్లో ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఫె డెక్స్ కొరియర్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతాయి అప్రమత్తంగా ఉండాలన్నారు.