TS : డజన్ సీట్లు గ్యారంటీ.. ఈటల ధీమా

Update: 2024-05-16 16:38 GMT

తెలంగాణలో బీజేపీకి 12 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీ నేత, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల కూడా ప్రధాని మోడీ వైపే చూస్తున్నారన్నారు.

సాధ్యం కాని హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు ఈటల రాజేందర్. కాంగ్రెస్ పాలనలో దందాలు, దౌర్జన్యాలు మినహా మరేవీ లేవని విమర్శించారు. రేవంత్ సర్కార్‌పై అతి తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని ఈటల అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఈటల కోరారు.

Tags:    

Similar News