దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

Update: 2020-11-09 15:48 GMT

ఈ నెల 3న జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సిద్ధిపేట జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి భారతి హెళ్లీకేరీ తెలిపారు. సిద్ధిపేట ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలోని డీబ్లాకులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఓట్ల లెక్కింపును వీడియో తీస్తున్నామన్నారు. కౌంటింగ్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వెబ్ సైట్ లో పొందుపరుస్తామని వివరించారు.

మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఎనిమిదన్నర గంటలకు తొలి రౌండ్ ఫలితం రానుంది. అనంతరం ఈవీఎంలను లెక్కించనున్నారు. కౌంటింగ్ కు 14 టేబుళ్లు ఏర్పాటుచేశారు. 23 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా స్పష్టమైన ఫలితాలు వచ్చే అవకాశముంది.

దుబ్బాక ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరీహోరీ ప్రచారాలతో ఎన్నికల హీట్ పెంచాయి. ఈ ఉపఎన్నిక ఫలితంపై పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News