TS : జూన్ 2 వేడుకలకు ఈసీ ఓకే.. ప్రత్యేకతలు ఇవే!

Update: 2024-05-25 06:05 GMT

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. ఇందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభించింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు సన్నాహాలు భారీగా చేస్తోంది. పదేళ్ల ఉత్సవాలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ లో అమరవీరులకు నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. ఈ ఉత్సవాల్లోనే “జయ జయహే తెలంగాణ" రాష్ట్రగీతాన్ని సరికొత్త రూపంలో ఆవిష్కరిస్తారు.

ఈ వేడుకలకు సోనియగాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. సోనియా సమక్షంలోనే సవరించిన రాష్ట్ర చిహ్నం, కొత్త రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి కొత్త విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. వేడుకల ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి ఉన్నతస్థాయిలో సమీక్షించి అధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు.

Tags:    

Similar News