EC: లోక్‌సత్తా సహా 9 పార్టీల గుర్తింపు రద్దు

Update: 2025-09-21 04:30 GMT

తె­లం­గా­ణ­లో 9 రా­జ­కీయ పా­ర్టీ­ల­ను ఎన్ని­కల సంఘం రద్దు చే­సిం­ది. రా­ష్ట్రం­లో నమో­దైన 9 గు­ర్తిం­పు లేని రా­జ­కీయ పా­ర్టీ­ల­ను రద్దు చే­సి­న­ట్లు రా­ష్ట్ర ప్ర­ధాన ఎన్ని­కల అధి­కా­రి సు­ద­ర్శ­న్‌ రె­డ్డి తె­లి­పా­రు. చట్ట­ప­ర­మైన ని­బం­ధ­న­లు పా­టిం­చ­క­పో­వ­డం­తో డీ­లి­స్టిం­గ్‌ చే­సి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. రద్ద­యిన పా­ర్టీ­ల్లో ఆల్‌ ఇం­డి­యా ఆజా­ద్ కాం­గ్రె­స్ పా­ర్టీ, ఆల్‌ ఇం­డి­యా బీసీ ఓబీ­సీ పా­ర్టీ, బీసీ భారత దేశం పా­ర్టీ, భా­ర­త్ లే­బ­ర్ ప్ర­జా పా­ర్టీ, లోక్ సత్తా పా­ర్టీ, మహా­జన మం­డ­లి పా­ర్టీ, నవ­భా­ర­త్ నే­ష­న­ల్ పా­ర్టీ, తె­లం­గాణ ప్ర­గ­తి సమి­తి, తె­లం­గాణ ఇం­డి­పెం­డెం­ట్ పా­ర్టీ ఉన్నా­యి. ఈ పా­ర్టీ­ల­న్నీ నమో­దు అయి­న­ప్ప­టి­కీ గు­ర్తిం­పు పొం­ద­లే­ద­ని, ప్ర­జా­స్వా­మ్య ప్ర­తి­ని­ధుల చట్టం–1951 ప్ర­కా­రం తప్ప­ని­స­రి ని­వే­ది­క­లు, లె­క్క­లు సమ­ర్పిం­చ­క­పో­వ­డం­తో ఎన్ని­కల సంఘం రద్దు చే­సిం­ద­ని సు­ద­ర్ష­న్ రె­డ్డి వి­వ­రిం­చా­రు.

Tags:    

Similar News