MP Raghunandan Rao : కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలి : ఎంపీ రఘునందన్ రావు

Update: 2025-05-09 09:15 GMT

ఉగ్రదాడి నేపథ్యంలో దేశ సమైక్యత, సమగ్రతను భంగం వాటిల్లే వార్తలు రాయొద్దు.. ప్రచారం చేయొద్దని స్వయంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని పత్రికలు, చానళ్లు పాకిస్తాన్ తీరును తప్పుబడుతూ.. భారత దేశ సైన్య పరాక్రమాన్ని ప్రశంసిస్తున్నాయి. దేశం మొత్తం మన సైన్యం పనితీరును గర్విస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ కరపత్ర మైన నమస్తే తెలంగాణ మాత్రం మన సైన్యం పనితీరును తప్పు పట్టేలా తప్పుడు వార్తలు ప్ర చురించింది.' అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ మెదక్లో రఘునందన్ మీడియాతో మాట్లాడారు.. కేంద్రంపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. పత్రి కలకు కొంచమైన సంస్కారం ఉండాలి కదా? అని అన్నారు. ఇంత సంస్కార హీనం, నీచ సంస్కృతి ఉంటదా.. అని ఆయన ప్రశించారు. 'నమస్తే తెలంగాణ వెబ్ పేజీల్లో 5 భారత సైనిక విమానాలను పాక్ కూల్చి వేసిందని తప్పుడు వార్త ప్రచురించింది. నమస్తే తెలంగాణ పత్రిక యజమాని డీకొండ దామోదర్ రావు మీద దేశ ద్రోహం కేసు పెట్టాలి. ఆ పత్రిక లైసెన్స్ రద్దు చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేస్తాం. ఆయన రాజ్య సభ సభ్యత్వం రద్దు చేయాలని ఉప రాష్ట్ర పతి కూడా లేఖ రాస్తాం. దేశ ద్రోహులను రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి వస్తుంది. నేను మూడు సైనిక్ స్కూల్ ల మంజూరు కోసం కేంద్ర రక్షణ మంత్రి ని కలిసి విజ్ఞప్తి చేస్తే... సైనిక్ స్కూల్ ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతొందని నమస్తే తెలంగాణలో తప్పుడు వార్త రాశారు. 2017 లో వరంగల్ కు సైనిక్ స్కూల్ మంజూరు చేస్తే పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం చూపించలేదు. పత్రిక ఓనర్ పై కేసు నమోదు చేయాలని మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశాం అన్నారు.

Tags:    

Similar News