తెలంగాణలో ఈ నెల 12 వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్లు జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.
మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలుపడు తాయని.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలుపడే సూచలున్నా యని పేర్కొంది. అదేవిధంగా హైదరాబాద్ లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిం చింది. ఈ మేరకు నగరానికి ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.