కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే కులగణనకు ప్రాథమికోన్నత, హైస్కూల్లలో పనిచేస్తున్న టీచర్లను మినహాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కులగణనలో 36,549 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు), 3,414 మంది ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, 6,256 మండల రిసోర్స్ పర్సన్లు, 2వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొననున్నారు. ఈనెల 6 నుంచి కులగణనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో టీచర్ల సేవలను వినియోగించుకోవాలని సంకల్పించింది. కులగణన నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తాయి. భోజన విరామం అనంతరం ఉపాధ్యాయులు కులగణన ప్రక్రియలో పాల్గొంటారు.
----