ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతు ఆత్మహత్యలతో సతమతమయ్యేదని, తమ హయాంలో సూసైడ్స్ గణనీయంగా తగ్గాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నదాత వెన్నువిరిగింది. NCRB ప్రకారం రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే ఎక్కువ. మొత్తం ఆత్మహత్యల్లో 11.1 శాతం సూసైడ్స్ రాష్ట్రానివే. కానీ మా పాలన ముగిసేసరికి వాటిని 1.5శాతానికి తగ్గించాం’ అని పేర్కొన్నారు.
24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. ‘11 నుంచి 13 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారు. నేను స్వయంగా గ్రామాల్లో తిరిగి తెలుసుకున్నాను. కేటీఆర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. రైతు బంధుతో సాగు పెరిగిందని కేటీఆర్ అంటున్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా’ అని సవాల్ చేశారు.