రైతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయినా వరికి బోనస్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదన్నారు.
వరికి క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని మోసం చేసిందని రైతులు ఆరోపించారు. ఇప్పుడు సన్నరకం వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామంటున్నారని దీని వల్ల లావు రకం వడ్లు పండించిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నా అనంతరం రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు.