Kamareddy: కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం.. నేతల హౌస్ అరెస్ట్‌లు
Kamareddy: కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కామారెడ్డిలో టెన్షన్ వాతావారణం నెలకొంది.;
Kamareddy: కామారెడ్డి కొత్త మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కామారెడ్డిలో టెన్షన్ వాతావారణం నెలకొంది.ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతు జేఏసీ చేపట్టిన బంద్ కొనసాగుతుంది. బంద్ నేపధ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు.. ఎక్కడికక్కడ నేతల హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.. బంద్ నేపధ్యంలో విద్యాసంస్ధలు మూసేశారు..
రైతులకు మద్దతుగా బైక్ ర్యాలీ చేసిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్ లో వ్యాపార సంస్థలను మూసి వేయిస్తున్నారు. బందుకు మద్దతుగా విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. అయితే బంద్ నేపధ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు..ఎక్కడికక్కడ నేతల హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు..
మరోవైపు కామారెడ్డిలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామంటున్నారు రైతులు. కామారెడ్డి బంద్‌తో మరింత టెన్షన్ పెరింగింది. కామారెడ్డి రైతు భూపోరాటం.. తెలంగాణా మొత్తాన్ని ఉడికిస్తోంది. మాస్టర్‌ప్లాన్‌లో తన భూమి పోతుందనే ఆవేదనతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన మరింత ఉధ్దృతమైంది.
ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ కార్యాలయం నుంచి కామారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నారు. చనిపోయిన ఎల్లారెడ్డి రైతు పయ్యావుల రాములు కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించనున్నారు.
మరోవైపు కాంగ్రెస్ కూడా రైతులు చేపట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓ బృందం కామారెడ్డికి వెళ్లి రైతులకు సంఘీభావం తెలపనున్నారు.. రైతులకు అండగా ఉంటామని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.