Nagarkurnool District : మైనింగ్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు

Update: 2025-01-21 05:30 GMT

తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. మైలారం గ్రామంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మైనింగ్ వద్దు.. గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దాంతో పోలీసులు పలువురు రైతులు, స్థానికులను ముందస్తు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్ట్‌ చేసిన వారిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి రాకుండా కంచె ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News