Fire Accident: రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం
టింబర్ డిపోలో చెలరేగిన మంటలు; అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న అగ్నిమాపక దళం;
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టింబర్ డిపోలో చెలరేగిన మంటలు ఉధృతంగా మారి డిపో మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. షార్ట్ సక్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. సుమారు 8మంది సిబ్బంది నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.