టీఆర్ఎస్ విజయ సంబురాల్లో ప్రమాదం..!
హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్‌లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించారు.;
హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించారు. దీంతో తెలంగాణ భవన్‌లో ఆపార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో విజయ సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అయితే పటాకుల నిప్పు రవ్వ పక్కనే పందిరిపై పడింది. వెంటనే మంటలు అంటుకోవడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్టీ నేతలు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది వాటర్ పైపులతో మంటలను ఆర్పారు.