దీపావళికి ఒక్కరోజుముందే.. బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం

Update: 2020-11-13 05:26 GMT

దీపావళి పండుగకు ఒక్కరోజుముందే.. బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న తరుణంలో కాలుష్యం పెరుగుతున్న కారణంగా బాధితులపై తీవ్ర ప్రభావం చూపనుందని పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధించాయని గుర్తుచేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కరోనా తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతున్నందున బాణాసంచాకాల్చడంపై నిషేధం విధించాలని కోరింది. అయితే ఇప్పటికే బాణాసంచా విక్రయాలకు ఏర్పాట్లు చేసుకున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుదృష్టికి తీసుకెళ్లగా.. బాణాసంచాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో ఈనెల 19న అందించాలని అడ్వకేట్ జనరల్‌ను న్యాయస్థానం కోరింది.

రాష్ట్రంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో బాధితులపై తీవ్ర ప్రభావం ఉందని న్యాయవాది ఇంద్రప్రకాశ్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు రాష్ట్రంలో క్రాకర్స్ అమ్మకాలు, కాల్చడంపై నిషేధం విధించాలని ఆదేశించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారని అడ్వకెట్ జనరలన్‌లను ప్రశ్నించింది. అయితే దీనిపై ఒకనిర్ధిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్టీటీ మార్గదర్శకాల ప్రకారం అవసరమైతే ఆంక్షలువిధిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే దీపావళి పండుగకు ఒక్క రోజు ముందు హైకోర్టు నిషేధం విధించడంపై బాణాసంచా వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హైకోర్టు తీర్పు బాధాకరమని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. అలాంటి సమయంలో హోల్ సేల్ వ్యాపారులకు 6నెలల ముందే చెబితే బాగుండేదన్నారు. విక్రయాలకు మరో రెండు రోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.  

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పలుప్రాంతాల్లో అధికారులు రంగంలోకి దిగారు. హైకోర్టు తీర్పునేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడలో అధికారులు బాణాసంచా షాపులను మూసివేశారు. దీంతో అధికారుల చర్యలను నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. లక్షల్లో పెట్టుబడులు పెట్ట్టామని ... అధికారుల తీరుతో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. 

Tags:    

Similar News