ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(BNS) చట్టంలో భాగంగా తెలంగాణలో తొలి కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని చార్మినార్ పీఎస్ పరిధిలో నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న బైకర్‌పై సెక్షన్ 281 BNS, ఎంవీ యాక్ట్ కింద కేసు పెట్టారు. కొత్త చట్టం ప్రకారం డిజిటల్ FIR నమోదు చేసినట్లు DGP ఆఫీస్ ట్వీట్ చేసింది. కాగా IPC స్థానంలో కేంద్రం BNS తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
మలులోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాల్లో పోలీస్ రిమాండ్‌ను 40-75రోజులకు పెంచారన్న ప్రచారంలో నిజం లేదని PIB స్పష్టం చేసింది. ‘పోలీసు రిమాండ్ ఇప్పటికీ 15 రోజులే ఉంది. గతంలో పోలీసులకు నిందితుడిని అరెస్ట్ చేసిన తొలి 15రోజుల్లోనే కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉండేది. కొత్త చట్టాల ప్రకారం డిటెన్షన్ పీరియడ్ (60-90 రోజులు)లోని తొలి 40-60 రోజుల్లో ఎప్పుడైనా పోలీస్ కస్టడీ విధించొచ్చు’ అని పేర్కొంది.