TG : ముందు కేసీఆర్.. తర్వాత రేవంత్.. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వరుస భేటీలు

Update: 2025-03-06 09:15 GMT

వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ టీచర్స్‌ ఎమ్మెల్సీగా గెలుపొందిన పింగిళి శ్రీపాల్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న..ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తానన్నారు ఎమ్మెల్సీ శ్రీపాల్‌ రెడ్డి. బుధవారం రాత్రి మాజీ సీఎం కేసీఆర్‌ ను కూడా కలిశారు శ్రీపాల్ రెడ్డి. ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి .. కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags:    

Similar News