Transgender Clinic : తెలంగాణలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ క్లినిక్..
Transgender Clinic : తెలంగాణలోనే మొదటిసారి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా ఓపీని ఏర్పాటు చేశారు
Transgender Clinic : తెలంగాణలోనే మొదటిసారి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా ఓపీని ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేకంగా ఔట్ పెషెంట్ విభాగం ఏర్పాటు చేయాలన్న ట్రాన్స్‌జెండర్ల విజ్ఞప్తిపై వరంగల్ కలెక్టర్ గోపీ, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చొరవ తీసుకున్నారు.
దీంతో ఎంజీఎంలో వారికి ఓపీ విభాగం ఏర్పాటైంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ట్రాన్స్‌జెండర్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వీటితో పాటు అన్ని రకాల సర్జరీలు ఇక్కడే చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని ట్రాన్స్‌జెండర్లు కోరుతున్నారు. అన్ని విభాగాలలో, అన్ని రంగాలలో తమకు ప్రభుత్వం అవకాశం కల్పించాలంటున్నారు ట్రాన్స్‌జెండర్స్.