Bogatha Waterfalls : బొగతకు పోటెత్తుతున్న వరద.. పర్యాటకులకు నో ఎంట్రీ..
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో భారీగా వరద పోటెత్తుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో చెరువులు నిండి వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతం అయిన బొగత జలపాతంకు వరద పోటెత్తింది. ప్రస్తుతం బొగత వద్ద భీకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ఈ తెల్లవారుజామున ప్రకటన విడుదల చేశారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.