TS : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిద్ధిపేట మాజీ కలెక్టర్

Update: 2024-03-22 10:19 GMT

నాగర్ కర్నూల్ (Naagar Kurnool), మెదక్ ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులను కేసీఆర్ (KCR) ప్రకటించారు. నాగర్ కర్నూల్‌ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్‌ నుంచి మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా ఆరు సీట్లకు క్యాండిడేట్లను నిర్ణయించాల్సి ఉంది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లకు గులాబీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే ఈ సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

వెంక‌ట్రామి రెడ్డి 21 సెప్టెంబర్ 1962లో తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, ఇందుర్తి గ్రామంలో పరుపాటి రాజిరెడ్డి, పుష్పలీల దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1996లో గ్రూప్‌-1 ఉద్యోగం సంపాదించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బందర్‌, చిత్తూరు, తిరుపతిలో ఆర్డీవోగా పని చేశారు. ఆయన 2002 నుండి 2004 వరకు మెదక్‌ ఉమ్మడి జిల్లా డ్వామా పీడీగా పని చేశారు. వెంకట్రామి రెడ్డి హుడా సెక్రటరీగా, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్‌గా పని చేసి 2007లో ఐఏఎస్‌ హోదా పొందారు. ఆయన 24, మార్చి 2015 నుంచి 10, అక్టోబర్‌ 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తరువాత 11 అక్టోబర్, 2016న సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు సిరిసిల్ల కలెక్టర్‌గా, తర్వాత సిద్దిపేట కలెక్టర్, 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల పాటు సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వహించి ఎన్నికల అంతరం తిరిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి నవంబర్ 15, 2021న ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.

Tags:    

Similar News