Minister Talasani : ఇథనాల్ ఫ్యాక్టరీతో మాకు సంబంధం లేదు : మాజీ మంత్రి తలసాని
దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యా క్టరీతో తమకెలాంటి సంబంధమూ లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లా డారు. తన కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు ఆ కంపెనీలో వాటాలున్నాయం టూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించు కున్నాయి. ఆ కంపెనీ యాజమాన్యంలో తమ కుటుంబ సభ్యులు ఎవరూ లేరని తెలిపారు. ఎనిదేళ్ల క్రితం తన కుమారుడు పీఎంకే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడని.. రాజమండ్రిలో కంపెనీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి నా అక్కడ కంపెనీ ఏర్పాటు రద్దు కావడంతో ఆ గ్రూప్ నుంచి తమ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేశారని అన్నారు. ఒక్కసారైనా తాను కానీ, తమ కుటుంబ సభ్యులు నిర్మల్ వె ళ్లినట్లుగా నిరూపించాలని కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్ విసిరారు. తనను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లుతు లం న్నారని ఆరోపించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పర్మి షన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. మొన్న లగచర్లలో రైతులు దాడి చేస్తే కేటీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారన్నారు. రా ష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా హామీలు నెరవేర్చలేదని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, దానిని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తు న్నారని మండిపడ్డారు.