MLA Koneru Konappa : కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గుడ్ బై

Update: 2025-02-21 13:15 GMT

కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రకటించారు. ఇక నుంచి తాను స్వతంత్రంగా ఉంటానని, ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. గత ఏడాది మార్చి 6న ఆయన బీఆర్ఎస్‌ను వీడి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. . అయితే.. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్టు కోనేరు కోనప్ప తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని కోనప్ప స్పష్టం చేశారు. అయితే.. తాజాగా జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి ఆయన తన మద్దతు ప్రకటించారు.

మరోవైపు.. కోనేరు కోనప్ప 2014 ఎన్నికల్లో బీఎస్సీ నుంచి పోటీ చేసి నాటి బీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై విజయం సాధించారు. అయితే.. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అనంతరం 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక.. 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే.. ఆ ఎన్నికల్లో తనపై బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన కోనప్ప.. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Tags:    

Similar News