అలెర్ట్ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులపాటు విభిన్న వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అధిక ఎండలతోపాటు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లా లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వరంగల్, మహబూ బాబాద్, ములుగు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ మినహా మిగతా అన్ని జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దాదాపు 21 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణశాఖ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటరల్ వేగంగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురు వారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. బషీర్ బాగ్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్ నగర్ లో కూడా వర్షం పడింది. హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్, హైదర్ షాకోట్ ప్రాంతాలలో ఒక్కసారిగా వర్షంతో పాటు వడగళ్లు పడడంతో ప్రజలు భయాందోళనలకు గుర య్యారు. రోడ్డుపై ఎటు చూసినా మంచు గడ్డలు కనిపించాయి. రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, హైదరాకోట్, బహదూర్పురా, ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట, బార్కస్, షాలిబండ, సుల్తాన్ బజార్, నాంపల్లి, అబిడ్స్ ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురిశాయి. అప్పటి వరకు వేసవి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వానచినుకులు పలక రించాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబ డింది. తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించింది. ఒక్కసారిగా భారీ వర్షంకురవడంతో వాహన దారులు, పాదచారులు చాలాసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.