భాగ్యనగర వాసులకు బంగారం లాంటి వార్త.. జనవరి మొదటివారం నుంచి..

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నగర వాసులకి ఇచ్చిన హామీ మేరకు

Update: 2020-12-19 10:37 GMT

హైదరాబాద్ ప్రజలకి కొత్త సంవత్సరం కానుకగా గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana ). జనవరి మొదటివారం నుంచి నగరంలో ఉచిత తాగునీరు సరఫరా కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో(GHMC Elections 2020) భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR)నగర వాసులకి ఇచ్చిన హామీ మేరకు 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.

సీఎస్ జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి.. రెండు రోజుల్లో తాగునీటి పైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు జ‌ల‌మండ‌లి ద్వారా 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు తాగునీరు ఉచితంగా ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అటు డిసెంబ‌ర్ నెల బిల్లులో 20 వేల లీట‌ర్ల వ‌ర‌కు ఛార్జ్ చేయొద్ద‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ఈ ఉచిత తాగునీరు సరఫరా కార్యక్రమాన్ని భవిష్యత్తులో రాష్ట్రమంతటా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News