TG : నిమజ్జనంలో హంగామా వద్దు.. చెత్త రోడ్లపై పడేయొద్దు.. ఆమ్రపాలి రిక్వెస్ట్

Update: 2024-09-16 15:08 GMT

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి వచ్చే భక్తులు రోడ్లపై కాగితాలు, చెత్త వేయకుండా సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు. ట్యాంక్ బండ్ పై నిమజ్జన ఏర్పాట్లను ఆమ్రపాలి పరిశీలించారు.

హుస్సేన్ సాగర్ వద్ద మొత్తం 38 క్రేన్లు, ఏర్పాటు చేశామని, జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్లు వినియోగిస్తున్నట్లు చెప్పారామె.

నిమజ్జనం ప్రాంతాల్లో 15 వేల మంది సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు ఆమ్రపాలి. అలాగే జీహెచ్ఎంసీ ట్విట్టర్ వేదికగా కీలక విజ్ఞప్తి చేసింది. 'వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా మిషన్లతో రోడ్లపై గాల్లోకి కలర్ కాగితాలు ఎగరేయటం అప్పటికప్పుడు మీకు తాత్కాలికంగా వినోదంగా అనిపించవచ్చు. కానీ రోడ్లను శుభ్రం చేయడం సిబ్బందికి కష్టతరమవుతోంది. అలాగే ఆ చెత్త.. డ్రైనేజీ నీరు పోయే మార్గాల్లో ఇరుక్కుని రోడ్డుపై వరదలకు కారణం అవుతుంది. ఇలాంటి రంగుల కాగితాలు, ప్లాస్టిక్ తో కూడుకున్న రిబ్బన్లు రోడ్లపై ఎగరేయొద్దు' అని ప్రజలను కోరారు ఆమ్రపాలి

Tags:    

Similar News