నవంబరులో జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలు!.. సిద్ధంగా ఉండాలి : కేటీఆర్‌

గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదని సర్వేలో తేలిందని, ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలి..

Update: 2020-09-29 09:14 GMT

GHMC ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR. నవంబరు రెండో వారం తరువాత ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చన్నారు. బల్దియా ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెడుతూ.. MLAలు, MLCలు, కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. గ్రేటర్‌లో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదని సర్వేలో తేలిందని, ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలని సూచించారు. గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా సిద్ధమని KTR అన్నారు. ప్రతి కార్పొరేటర్ 3 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.

Similar News