నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. సొంత అక్క కూతురినే కిడ్నాప్ చేసింది ఓ మాయలేడి. పట్టణానికి చెందిన మంగమ్మ, కళ్యాణి అక్కా చెల్లెల్లు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్క మంగమ్మ అప్పు చెల్లించకపోవడంతో ఆమె 14 ఏళ్ల కూతురిని కళ్యాణి కిడ్నాప్ చేసింది. 11 రోజులపాటు చిత్రహింసలకు గురిచేసింది. బాలిక మిస్సింగ్‌పై కన్నతల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కళ్యాణి కంగారు పడింది. ఆ బాలికను ఆమె ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం బాధిత బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.