Minister Ponnam : రూ.98.35కోట్లు ఇవ్వండి .. కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి పొన్నం లేఖ
డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఆటో మిషన్కు రూ.43.45 కోట్లు ఖర్చవుతుందని, ఆ నిధులు విడుదల చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు. రవాణా శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలతో పాటు డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఆటో మిషను నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం లేఖ రాశారు. రాష్ట్రంలో 25 ద్విచక్ర, 27 నాలుగు చక్రాల వాహనాలు, 5 హెవీ వెహికల్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్లు అం దుబాటులో ఉన్నాయన్నారు. ఏడాదిలో దాదాపు 4.90 లక్షల లైసెన్లు జారీ చేస్తున్నామని, ఇప్పటికే ఉన్న డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ను ఆటోమేట్ చేయడా నికి, సెన్సార్లు, ఐడెంటిటీ రికగ్నిషన్ పరికరాలు, సపోర్టింగ్ సాఫ్ట్వేర్, టెక్నికల్ అక్షరాస్యత కలిగిన సిబ్బంది కార్యకలాపాలను చేపట్టడం అవసరం అన్నారు. తెలంగాణలోని రవాణా శాఖ వాహన్, సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు రోల్ అవుట్, ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్, వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కాలేజీలలో అవ గాహన కల్పించడం వంటి అనేక కార్యక్ర మాలను చేపడుతోందన్నారు. రాష్ట్రంలో కొనుగోలు చేసిన, నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను, రిజి స్ట్రేషన్ ఫీజు రెండింటిపై 100 శాతం మినహాయింపును అందించడంతో ఎల క్లిక్ వాహనాల వినియోగం వేగవంతం చేశామన్నారు. అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభు త్వం చురుకుగా పని చేస్తోందని లేఖలో వివరించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మరో ఐడీటీఆర్ను ఏర్పాటు చేయడానికి అనుమతిని ఇవ్వాలని కూడా పొన్నం కోరారు.