హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళ్లలో మార్పులు చేశారు.
ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండగా, దీనిని మరో 45 నిమిషాలు పొడిగించారు. అంటే ఇకపై రాత్రి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉంటుంది.
ప్రస్తుతం ఉదయం ఆరు గంటలకు తొలి రైలు అందుబాటులో ఉండగా, ప్రతి సోమవారం 5.30 గంటలకే తొలి రైలు అందుబాటులో ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు. పొడిగించిన వేళలు అమలులోకి వచ్చాయి