Telangana : ప్రయాణికులకు గుడ్ న్యూస్..రోడ్ల పైకి రానున్న కొత్త బస్సులు

Update: 2025-07-10 12:45 GMT

తెలంగాణ ఆర్టీసీ లోకి కొత్త బస్సులు రాబోతున్నాయి. ఈ మేరకు రాష్ట ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీ యాజమాన్యం. కొత్తగా 422 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం లో భాగంగా ఆడబిడ్డలను ఉచితంగా గమ్య స్థానాలకు చేరుస్తుండడంతో బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొత్త బస్సులు ప్రయాణికులకు ఊరట కల్పించనున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాలంచెల్లిన 294 పల్లె వెలుగులు, 88 మెట్రో డీలక్స్ లు , 17 ఎక్స్ప్రెస్ లు, 22 డీలక్స్ల స్థానంలో కొత్త బస్సులు రోడ్ల పైకి రానున్నాయి. 13 నుంచి 15 లక్షల కి.మీ తిరిగినా లేదా 15 ఏళ్ల కాలం దాటిన బస్సులను ఆర్టీసీ ఇక నుంచి పక్కన పెట్టనుంది.

Tags:    

Similar News