Sabitha Indra Reddy : ప్రభుత్వం రైతుల బాధ అర్థం చేసుకోవాలి.. సబిత విన్నపం
రైతు దగ్గర తీసుకున్న భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫ్యూచర్ సిటీకి 330 ఫీట్ల రోడ్డు అవసరమా అని ప్రశ్నించారు. 330 ఫీట్ల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ ఘటన ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి నిదర్శనమన్నారు. అధికారులపై దాడి బాధాకరమని.. అయితే రైతులు వారి బాధను వ్యక్తం చేసే విషయంలో ఆక్రోషానికి గురయ్యారన్నారు. సీఎం సొంత నియోజకవర్గం ప్రజలకే న్యాయం చేయకపోతే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేవరకు రైతుల పక్షాన పోరాడతామని సబిత స్పష్టం చేశారు.