Ration Cards : రేషన్ కార్డులపై సర్కారు కీలక ప్రకటన

Update: 2024-07-08 07:12 GMT

రేషన్ కార్డుల్లో మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ స్పష్టం చేసింది. వివాహాలు అయిన వారు, ఏవైనా మార్పులు చేర్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రభుత్వంఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరింది.

కాగా... రేషన్ కార్డుల్లో సవరణలు, పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, శనివారం నుంచి మీసేవా కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు రాష్ట్రంలోని మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. అయతే ఇంకా ఎలాంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని తాజాగా పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Tags:    

Similar News