TS : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి .. ఏనుగల రాకేష్‌రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ ఎస్ అభ్యర్థిగా ఏనుగల రాకేష్‌రెడ్డికి అవకాశం దక్కిం ది. ఈ మేరకు శుక్రవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఈ ఉపఎన్నిక జరగబోతోంది. ఈ స్థానం కోసం వరంగల్ నుంచి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ పోటీ పడగా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన రాకేష్‌రెడ్డికి అవకాశం దక్కింది.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన రాకేష్‌రెడ్డి.. బిట్స్ పిలానిలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో ఉద్యోగం చేసి రాజకీయాలపై ఆసక్తితో 2013లో బీజేపీలో చేరి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశించినా అవకాశం దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు. వరంగల్ కేంద్రంగా అనేక ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రాకేష్‌రెడ్డి.. ఉమ్మడి జిల్లా వాసులకు సుపరిచితుడు. యువతలో మంచి గుర్తింపు ఉన్న రాకేష్‌రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ బరిలో దిగబోతున్నారు.