గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం మారిపోనుందా? హైదరాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారా అంటే అవుననే తెలుస్తోంది. ఇప్పటికే హైడ్రాతో చెరువులు, నాలాలు, మూసీ ఆక్రమణలను తొలగిస్తున్న రేవంత్ సర్కార్.. మహానగర్ అభివృద్ధి కోసం పాలనను మరింత విస్తరించే యోచనలో ఉందని తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీని వచ్చే ఎన్నికల నాటికి నాలుగు కార్పొరేషన్లుగా విభజిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి హైదరాబాద్ మహా నగరంలో నలుగురు మేయర్లు ఉంటారని తెలిపారు. కోమటిరెడ్డి ప్రకటనతో జీహెచ్ఎంసీ స్వరూపం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీని విభజిస్తే ఎవరికి ప్రయోజనం.. ఎవరు టార్గెట్‌గా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.