Harish Rao : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపిస్తేనే హుజూరాబాద్ అభివృద్ధి జరుగుతుంది..!
Harish Rao : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు.;
Harish Rao : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున.. జమ్మికుంటలో ప్రచారం నిర్వహించిన హరీష్... గెల్లును గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ గెలిస్తేనే హుజూరాబాద్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని... టీఆర్ఎస్ గెలవగానే వాటన్నింటినీ పూర్తి చేస్తామని హరీష్‌రావు భరోసా ఇచ్చారు.