TG : హరీశ్ రావుకు రేవంత్ సర్కారు షాక్

Update: 2024-11-22 06:15 GMT

మాజీ మంత్రి హరీష్‌రావుకు ప్రభుత్వం షాకిచ్చింది. రంగనాయక సాగర్‌ దగ్గరలో ఉన్న ఫామ్‌ హౌజ్‌పై విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్. రంగనాయకసాగర్‌ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్‌ రావు తనపేరుపై రాయించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలో ఆరోపించారు. తన ఫామ్‌హౌస్‌కు వాటర్ ఫ్రంట్‌ వ్యూ ఉండాలని, అందుకే రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నారని విమర్శించారు. హరీష్‌రావు ఫామ్‌ హౌజ్‌పై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తమది కబ్జాల చరిత్ర కాదన్నారు హరీష్‌ రావు. తాను రైతుల వద్ద 13 ఎకరాల పట్టా భూమి కొనుగోలు చేశానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News