Hyderabad : హైదరాబాద్‌లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం...
హైదరాబాద్ రాయదుర్గంలో అమెరికన్ హెల్త్‌కేర్ దిగ్గజం హెచ్‌సీఏ హెల్త్‌కేర్ తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇది రాష్ట్ర ఐటీ రంగంలో మరో కీలక ముందడుగుగా పరిగణించబడుతోంది.
4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC), హెచ్‌సీఏ హెల్త్‌కేర్ యొక్క ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు ఒక కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స్ మరియు అనలిటిక్స్ వంటి అధునాతన రంగాలలో ప్రతిభావంతులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాజెక్ట్ 2025 చివరి నాటికి 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీంతో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.