Heart Attack: రన్నింగ్ చేస్తూ కుప్పకూలిన ఆర్మీ అధికారి..

Heart Attack: శామీర్‌పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రన్నింగ్ చేస్తుండగా సింగ్ కుప్పకూలిపోయాడు.

Update: 2022-01-07 09:30 GMT

heart attack: ఆర్మీ ఆఫీసర్లైనా, వైద్యం అందించే డాక్టర్లైనా ఎవరినీ వదిలిపెట్టని గుండెపోటు.. చిన్న వయసులోనే ఆగిపోతున్న గుండె.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆరోగ్యంగా ఉన్నా ఒక్కసారిగా గుండె ఆగిపోతోంది.. కుప్పకూలిపోతున్నారు.. మరుక్షణంలోనే ప్రాణాలు విడుస్తున్నారు. నగరంలోని శామీర్‌పేటలో విషాదం చోటు చేసుకుంది.

రన్నింగ్ చేస్తూ గుండెపోటుతో ఆర్మీ అధికారి సత్తార్ సింగ్ (43) మృతి చెందారు. శిక్షణలో భాగంగా 30 కిలోమీటర్ల పరుగులో సత్తార్ సింగ్ శుక్రవారం ఉదయం పాల్గొన్నారు. శామీర్‌పేట సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై రన్నింగ్ చేస్తుండగా సింగ్ కుప్పకూలిపోయాడు.

ఆయనను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మెహదీపట్నం రెజిమెంటల్‌లో సత్తార సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆర్మీలో ఏఎస్ఐ ర్యాంకు అధికారిగా సత్తార్ సింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. 

Tags:    

Similar News