తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. నిన్న ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు సూర్యతాపం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాడ్పులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు నిన్న వడదెబ్బకు గురై రాష్ట్రంలో ఐదుగురు మరణించారు.
మరోవైపు రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40KMS వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని తెలిపింది.