ములుగు జిల్లా ఏటూరు నాగారం చెల్పాక గ్రామంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున గ్రేహౌండ్స్ బలగాలకు ఎదురు పడడంతో పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులంత నర్సంపేట ఇల్లందు ఏరియా కమిటీ సభ్యులుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా జిల్లా వాజేడు మండలంలో పంచాయతీ కార్యదర్శి తో పాటు ఆయన సోదరుడిని కూడా ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరిని నరికి చంపారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి పోలీసు బలగాలు ములుగు జిల్లాను ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఎన్కౌంటర్ జరగడం గమనార్హం