Heavy Floods : కృష్ణాబేసిన్ లో భారీ వరద.. సాగర్ 18 గేట్ల నుంచి దిగువకు నీరు

Update: 2024-08-30 10:00 GMT

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉదృత పెరిగింది. ఎగువ శ్రీశైలం నుంచి వరద అంతకంతకు పెరుగుతుండటంతో.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు డ్యాం 18 గేట్లను పది అడుగులు.. 8 గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 3 లక్షల 3 వేల 836 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ నుంచి వరద మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన జూరాలకు 3 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.

Tags:    

Similar News