TG : తెలంగాణలో భారీగా పొగమంచు.. ఉదయం 9 తర్వాతే బయటకు రండి

Update: 2024-12-21 12:00 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఉదయం పూట భారీగా పొగమంచు కురుస్తోంది. తెల్లవారుజామున చాలా ప్రాంతాలను మంచుదుప్పటి కమ్మేస్తోంది. 8, 9 గంటల వరకూ కూడా పరిస్థితి సాధారణ స్థితికి చేరడంలేదు. ప్రధాన రహదారులు, గ్రామాలకు వెళ్లే రోడ్లు అన్ని పొగ మంచుతో నిండి పోయింది, గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో పొగమంచు అలుముకుంటోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కార్లు ఫాగ్‌ లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, ఆదిలాబాద్, మెదక్, నారాయణపేట పట్టణాలతో పాటు ఇతర మండలాలు పలు గ్రామాలు ఇదే పరిస్థితి నెలకొంది. 

Tags:    

Similar News