Revanth Reddy : భారీ వర్షాలు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Update: 2025-09-27 07:09 GMT

రాష్ట్రంలో భారీ వర్షాలపై.... సీఎస్ రామకృష్ణారావు సహా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని... నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో GHMC, హైడ్రాతో పాటు, NDRF, SDRF బృందాలు... అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ దిశగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని... సీఎస్, ఉన్నతాధికారులకు... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి 65వ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద నుంచి రుద్రారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంగారెడ్డి నుంచి ఇస్నాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర రద్దీ ఏర్పడింది. జాతీయ రహదారిపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆఫీసులకు వెళ్లాల్సిన వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు

Tags:    

Similar News