నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ్టి నుంచి మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, సిద్దిపేట, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
జూన్ 12 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని వాతావరశాఖ అంచనా వేసింది. జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరాయి.