Tadwai Tornado Incident : తాడ్వాయి టోర్నడోపై ఉన్నత స్థాయి విచారణ

Update: 2024-09-19 05:45 GMT

ఇటీవల గాలివాన బీభత్సవానికి మేడారం అడవి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వందల ఎకరాల్లో చెట్లు కూలిన ప్రాంతాన్ని మంగళవారం ఫారెస్ట్ విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలుసింగ్ మేరు, డీఎఫ్ రాహుల్ కిషన్ జావేద్, ఎఫ్ డీవో ఎస్ రమేష్ తో కలిసి సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సర్వేను స్పీడప్ చేసి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విపత్తు కారణంగా జరిగిన విధ్వంసంపై అధికారులకు వివరిస్తానని ఆయన తెలిపారు. ఆయన వెంట స్థానిక ఇన్చార్జ్ ఎఫ్ఆర్డీవో కృష్ణవేణి, రేంజ్ ఎస్ఆర్వో మాధవి సీతల్, ఎస్ఆర్ వో బాలరాజు, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News