కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 6న ఆయన హైదరాబాద్ కు రావాల్సి ఉంది. 6 న జరిగే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు ముందుగానే ప్రకటించారు. అయితే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల వల్ల తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పర్యటన రద్దు అయినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి పలువురు పార్లమెంటు సభ్యులతో ఆయన సమావేశం కానున్నారు. కాగా ఈ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూసిన స్థానిక బీజేపీ నేతలు నిరాశకు గురయ్యారు.